విశాఖలో కాగ్నిజెంట్…లోకేష్ హర్షం

12
- Advertisement -

భవిష్యత్ కార్యకలాపాలకు విశాఖను ఎంచుకున్న కాగ్నిజెంట్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. కాగ్నిజెంట్‍కు.. సన్‍రైజ్ రాష్ట్రానికి స్వాగతం..రాష్ట్ర యువతలో విశ్వాసాన్ని పెంచేలా కాపులుప్పాడలో 22 ఎకరాల్లో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటవుతోంది అని తెలిపారు.

సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఏపీని ప్రపంచస్థాయిలో ఆవిష్కరించేందుకు ఉపాధి శక్తికేంద్రంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం…. మెరుగైన అవకాశాలు కల్పిస్తూ, వృద్ధిని పెంచుతూ ప్రజలకు మెరుగైన భవిష్యత్‍ను రూపొందిస్తున్నాం అన్నారు.

విశాఖ కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ చేసింది కాగ్నిజెంట్ సంస్థ. సుమారు ఎనిమిది వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్వీట్‍లో కాగ్నిజెంట్ వెల్లడించింది. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని …2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2029 నాటికి ఐటీ క్యాంపస్ తొలిదశ పూర్తిచేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‍కు కృతజ్ఞతలు తెలిపింది కాగ్నిజెంట్ సీఈవో. కంపెనీ విస్తరణకు సహకరించిన చంద్రబాబు, లోకేష్‍కు కృతజ్ఞతలు తెలిపింది కాగ్నిజెంట్.

Also Read:మహావతార్ నరసింహ..రిలీజ్ డేట్

- Advertisement -