- Advertisement -
ఏపీ మంత్రి నారా లోకేష్ కుంభమేళాకు వెళ్లారు. షాహి స్నానఘట్టంలో పవిత్ర స్నానం ఆచరించారు. మధ్యాహ్నం 2.45 గంటలకు కాలభైరవ ఆలయం సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 3.40 గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి దేవాలయాన్ని సందర్శించనున్నారు. మహాకుంభమేళా పర్యటనకు తన కుటుంబాన్ని మాత్రమే తీసుకువెళ్లారు.
జనవరి 13 వ తేదీన మహా కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. 53 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మహాకుంభమేళాకి చాలామంది రాజకీయ ప్రతినిధులు పర్యటించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ సభ్యులు మరియు పలువురు రాజకీయ నాయకులు పుణ్యస్నానం ఆచరించారు.
Also Read:తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు
- Advertisement -