- Advertisement -
భారత్–పాక్ మ్యాచ్‌కు ప్రభుత్వ ఖర్చులతో వెళ్లానన్న ప్రచారాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ను ప్రభుత్వ డబ్బులతో చూసేందుకు వెళ్లారంటూ ఓ మీడియాలో ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లైట్ టికెట్, మ్యాచ్ టికెట్ రెండింటినీ తానే స్వంత డబ్బుతో కొనుగోలు చేశానని లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. “నా డబ్బుతో నేను మ్యాచ్ చూశాను. ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. నీవేమైనా ఖర్చు చేశానా?” అంటూ విమర్శకులపై మండిపడ్డారు.
తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించిన ఆయన, వ్యక్తిగత ప్రయాణాన్ని రాజకీయంగా మలచడం సరికాదన్నారు. నిజాలు బయటపెట్టేందుకు అవసరమైతే అన్ని వివరాలు వెల్లడించడానికి సిద్ధమని తెలిపారు.
Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

- Advertisement -

