అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలు, దేవుడికి జరిగిన మహాపచారం గురించి పూర్తి వివరాలను అసెంబ్లీ వేదికగానే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు నిజాలు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులుగా సభకు హాజరుకావడం వారి బాధ్యత అని గుర్తుచేశారు. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని అన్నారు.
దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు నిర్వహించడం ఆక్షేపణీయమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని చెప్పారు. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సభలోనే అన్ని విషయాలు చర్చించి, ప్రజలకు నిజాలు తెలియజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read:ఎక్స్ ట్రార్డినరీగా ‘సరస్వతి’!

