బాబు ప్లాన్.. ఎన్నికల ప్రచారంలో ఆ ఇద్దరు?

24
- Advertisement -

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీని గద్దె దించేందుకు అని విధాలుగా వ్యూహరచన చేస్తున్నారాయన. అందులో భాగంగానే ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి విధితమే. ఇక పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే ఏ చిన్న అంశాన్ని కూడా వదలడం లేదు చంద్రబాబు నాయుడు. ఇక ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ మూడు నెలల్లో ప్రచారంతో హోరెత్తెంచే విధింగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి మరియు నారా బ్రహ్మణి లని రంగంలోకి దించబోతున్నట్లు టాక్. ఆ మధ్య చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఈ ఇద్దరు చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో గట్టిగానే ప్రభావం చూపించాయి. .

ఎప్పుడు రాజకీయాల వైపు చూడని నారా భువనేశ్వరి మరియు నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చి చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై గళం విప్పడంతో ప్రజల్లో కొంత సానుభూతి ఏర్పడింది. ఇక అదే విధంగా రాబోయే ఎన్నికల ప్రచారంలో కూడా ఈ ఇద్దరు పాల్గొంటే పార్టీని మరింతగా ప్రజలకు దగ్గర చేయవచ్చనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 3,4,5 తేదీల్లో నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెలలోనే 25 భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఈ సభల్లో కూడా నారా బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొనే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీకి మైలేజ్ తెచ్చేందుకు కుటుంబ సభ్యులను చంద్రబాబు రంగంలోకి దించినట్లు స్పష్టమవుతోంది. మరి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రచారాలు టీడీపీ ఎంతవరకు మైలేజ్ తెస్తాయో చూడాలి.

Also Read:చిరంజీవితో మామూలుగా ఉండదు అట

- Advertisement -