బుడమేరులో నారా లోకేశ్..గండ్లు పూడ్చాలని ఆదేశం

1
- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుడమేరుకు గండ్లు పూడిక పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులతో కలసి మంత్రి నారాలోకేష్ పరిశీలించారు. ఇప్పటికే మొదటి గండి పూడ్చగా, మిగిలిన రెండు గండ్లు పూడ్చేలా పనులను పర్యవేక్షించారు.

అంతకముందు బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లను పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు లోకేష్. బుడమేరు కుడి,ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు లోకేష్. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో చర్చించారు లోకేశ్.

మరోవైపు కృష్ణాజిల్లా పామర్రు, పెదపారుపూడి మండలాల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. మోపర్రు, వింజరంపాడు గ్రామాల్లో పొంగిన బుడమేరు, వన్నేరు డ్రైన్లు,నీటి మునిగిన పొలాలు, గ్రామాలను సందర్శించారు కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు. పెదపారుపూడి మండలంలో సుమారు 4,600 ఎకరాల్లో వరి పంట నీట మునగగా ట్రాక్టర్ పై వెళ్లి గ్రామాల్లో నష్టాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్, ఎస్పీ.

Also Read:ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం

- Advertisement -