ఏపీ డిప్యూటీ సీఎం పదవిపై మరోసారి స్పందించారు మంత్రి నారా లోకేశ్. తాను కార్యకర్తగానే పనిచేస్తానని తేల్చి చెప్పారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ పై నమ్మకం లేదని, వైసీపీ నేతలకు ఎలా ఉంటుందని మండిపడ్డారు. ఈ విషయం ఎప్పటినుంచో చెబుతున్నాం, డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేసే ఛాన్స్ ఉందన్నారు.
రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీఏ లాంటిదని, స్టాన్‌ఫోర్డ్ లో తన చదువు వ్యాపారం చేయడానికి పనికొస్తుందని నారా లోకేష్ అన్నారు. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను విశాఖ ఎయిర్‌పోర్టుకు పలుమార్లు వచ్చాను.
టీడీపీ ప్రభుత్వం నాపై లాంజ్‌లో రూ.25 లక్షలు ఖర్చుపెట్టిందని సాక్షిలో కథనం వచ్చింది. దీనిపై అప్పట్లోనే పరువునష్టం దావా వేశాను. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాం అన్నారు.
Also Read:హైకోర్టుకు బీజేపీ ఎంపీ ఈటల