14న “నన్నుదోచుకుందువ‌టే” టీజ‌ర్..

215
Nannu Dochukunduvate Movie Teaser Release Date
- Advertisement -

స‌మ్మెహ‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసుకున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువ‌టే .. ఈ చిత్రం మొద‌టి లుక్ పోస్ట‌ర్ నుండి ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రం పై అంచ‌నాలు పెరిగాయి. నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో జూలై 14న 10:02 నిల‌కు టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లో విడ‌దల తేదిని ఎనౌన్స్ చేస్తారు.

Nannu Dochukunduvate Movie

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ… సుధీర్ బాబు హీరోగా సుదీర్‌బాబు ప్రోడ‌క్ష‌న్స్‌లో ‘నన్నుదోచుకుందువ‌టే’ చిత్రానికి సంబందించిన టీజ‌ర్‌ని జులై 14న రిలీజ్ చేస్తున్నాము. ఈ చిత్రం ప్రోడ‌క్ష‌న్ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు చేస్తున్నారు. క‌థ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మిగ‌తా వివ‌రాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.

నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు.. సాంకేతిక వర్గం: డిఓపి – సురేష్ రగుతు, మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి లోకనాథ్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి, ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్, పిఆర్ఓ – ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్, నిర్మాత – సుధీర్ బాబు, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు.

- Advertisement -