‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధం..

42
nani

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలి ఎంట‌ర్టైన‌ర్ `టక్ జగదీష్. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కు‌తోన్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో నానీకి అన్నయ్యగా జగపతిబాబు కనిపించనుండటం విశేషం.

ఇక ఏప్రిల్లోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు చిత్ర బృందం. కానీ అప్పుడప్పుడే కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో, ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు పరిస్థితి కొంతవరకూ అనుకూలంగా మారింది. త్వరలోనే థియేటర్లను తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. చిత్ర యూనిట్ సాధ్యమైనంత త్వరగా ఒక రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. థియేటర్లు ఓపెన్ కాగానే విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమా ముందు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

తారాగ‌ణం:నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పిఆర్ఓ: వంశీ-శేఖ‌ర్‌.