‘వి’.. రాక్షసుడిగా నాని ఫస్ట్‌లుక్..

271
nani
- Advertisement -

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా రూపొందుతోంది. సుధీర్ బాబు – నాని ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. నివేదా థామస్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సుధీర్ పాత్ర రక్షకుడిగా ఉంటుందనీ, నాని పాత్ర రాక్షసుడిగా ఉంటుందని ముందుగానే తెలియజేశారు. అలాగే రక్షకుడిగా నిన్న సుధీర్ బాబు పోస్టర్ ను వదిలారు. ఆ లుక్ మంచి మార్కులను కొట్టేసింది.

V First Looks

తాజాగా రాక్ష‌సుడుగా న‌టిస్తున్న నాని లుక్ రివీల్ చేశారు. చేతిలో క‌త్తెర ప‌ట్టుకొని సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నాడు నాని. నాని లుక్ తో సినిమాపై మరింతగా ఆసక్తి ఏర్పడటం .. అంచనాలు పెరగడం ఖాయంగా అనిపిస్తోంది. అమిత్‌ త్రివేది మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా మార్చి 25వ తేదీన విడుదల చేయ‌నున్నారు.

- Advertisement -