విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం క్రికెటర్‌గా జెర్సీ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
13బి,ఇష్క్,మనం, 24, హలో చిత్రాలకు దర్శకత్వం వహించి.. సెన్సిబుల్, సక్సెస్‌ఫుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఫిబ్రవరి 19న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీంతో ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుందా అని అంతా అనుకున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందనేది తాజా సమాచారం. అనూహ్యమైన మలుపులతో కొనసాగే ఈ కథలో ఆడవారికి సంబంధించిన మంచి మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది.
విజువల్స్ తో వండర్లు చేసే పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా త్వరలోనే ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడించనున్నారు.

