నాని…..’వి’ రిలీజ్ డేట్ ఖరారు

587
nani v release date
- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వి. నాని సరసన అదితిరావు హైదరి,నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా హీరో సుధీర్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది.

2020 మార్చి 25న ఉగాది కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. కొత్త సంవత్సరం,కొత్త స్టోరీ,కొత్త అనుభూతితో ముందుకువస్తున్నామని నిర్మాతలు తెలిపారు.యాక్షన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. హింసను కోరుకుంటున్నారా…ఈ ఉగాదికి సాలిడ్ యాక్షన్‌ మూవీతో వస్తున్నానని నాని తెలిపారు.

అష్టాచెమ్మ,జెంటిల్‌మెన్‌ తర్వాత మోహనకృష్ణ-నాని కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ మూవీ నాని 25వ సినిమా కావడం విశేషం.

- Advertisement -