నానికి పదేళ్లు…

230
nani
- Advertisement -

హీరో నానికి పదేళ్లు… అదేంటి నానికి పదేళ్లు ఏంటి అనుకుంటున్నారా.. నేను చెప్పేది ఆయన వయసు గురించి కాదు.. నాని సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటికి పదేళ్లు పూర్తయింది. దీంతో హీరోగా నాని పదేళ్లు పూర్తి చేసుకున్నాడన్నమాట.

nani

‘ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా… నీ పంట పండిందే ప్రేమా..’ అంటూ లావణ్యను ఆటపట్టించి మరీ ఆమె ప్రేమను గెలుపొందాడు రాంబాబు. మహేష్‌.. మహేష్‌ అంటూ కలువరించే లావణ్యను ప్రేమను పొందేందుకు రాంబాబు పడ్డ పాట్లు నవ్వు తెప్పించడంతో పాటు అతడిపై జాలి కలిగిస్తాయి. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు. నాని సినిమాల్లోకి రావడానికి ఎలాంటి బ్రాక్‌ గ్రౌండ్‌ లేదు.. మొదట ఆర్జేగా, తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి తర్వాత హీరో అయ్యాడు నాని. 2008 సంవ‌త్స‌రంలో అష్టా చెమ్మా అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేశాడు నాని.

nani

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌డంతో నానికి త‌ర్వాత మంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. 2009 నుండి 2011 సంవ‌త్స‌రం మ‌ధ్య ఐదారు సినిమాలు చేసిన నానికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించ‌లేదు. 2012లో వ‌చ్చిన ఈగ చిత్రం నాని రాత‌ని మార్చేసింది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ చిత్రంలో చేసింది కొద్ది సేపే అయిన మ‌నోడికి మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు నానిని కాస్త ఇబ్బందులకు గురి చేశాయన్నది మనందరికి తెలిసిందే.

nani

వరుస ఫ్లాప్‌ సినిమాలతో సతమతమవుతున్న నానిని ఎవడే సుబ్రమణ్యం` చిత్రం ఆదుకుంది. అటుపై మారుతి `భలేభలే మగాడివోయ్`తో బంపర్ హిట్ ఇచ్చాడు. ఇక అటుపై నాని జైత్రయాత్రకు ఎదురేలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాధ – జెంటిల్ మేన్ – మజ్ను – నేనులోకల్ – నిన్నుకోరి – ఎంసిఏ అన్నీ హిట్లే. వరుసగా ఎనిమిది విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు నాని. ప్రస్తుతం కింగ్‌ నాగార్జునతో కలిసి దేవదాస్‌ చిత్రంలో నటిస్తున్నాడు నాని. మొత్తానికి ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌లేకపోయినా స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదిగి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుని స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న నాని ముందు ముందు మరిన్ని విజయంతమైన చిత్రాల్లో నటించాలని మనమూ కోరుకుందాం.

- Advertisement -