నాని యుద్ధం మొదలుపెట్టాడు..

210
- Advertisement -

నాచురల్ స్టార్ నాని రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ త‌రం హీరోల‌లో నానికి ఉన్న స‌క్సెస్ రేటు మ‌రే హీరోకి లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే డ‌బుల్ హ్య‌ట్రిక్ సాధించిన నాని నిన్నుకోరి చిత్రంతో మ‌రో హిట్ కొట్టాడు. ఇక‌ ప్ర‌స్తుతం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ‘ఎంసీఏ’ సినిమాను నాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తాను చేయబోయే మరో సినిమా విశేషాల్ని కూడా వెల్లడించాడు నాని.

Nani to Play Two Roles in Krishnarjuna Yudham

నాని 21వ చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవల ఒకేసారి రెండు చిత్రాలను ప్రకటించిన నాని తన రెండో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‌‌లో కూడా పాల్గొంటున్నాడు.‘కృష్ణార్జున యుద్ధం మొదలైంది’ అంటూ తాజాగా ఈ సినిమాకి సంభందించిన.. ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు నాని. ఆ ఫొటోలో బైక్‌పై ఆకట్టుకునే పిల్లనగ్రోవి ఉండడం విశేషం. ఈమూవీలో కృష్ణుడు, అర్జునుడు రెండు పాత్రలు నాని చేయడం విశేషం.

Nani to Play Two Roles in Krishnarjuna Yudham

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. నాని, గాంధీ ఇద్దరూ సక్సెస్‌ఫుల్ ఫామ్‌లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు నటించిన అలనాటి కృష్ణార్జున యుద్ధం సినిమాతో నాని ఎలా తన స్టయిల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

- Advertisement -