Nani:ది ప్యారడైజ్..ఫస్ట్ సింగిల్!

5
- Advertisement -

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’ 2026 మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీని చిత్రబృందం ఇప్పటికే ఖరారు చేసినప్పటికీ, ఇంకా దాదాపు 60 రోజుల షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాయదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

‘ది ప్యారడైస్’పై ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ప్రమోషన్ల జోరు పెద్దగా కనిపించకపోవడంతో, ప్రచార కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న ఆసక్తి నెలకొంది. సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను నిలబెట్టుకోవాలంటే సరైన సమయంలో బలమైన ప్రమోషన్లు అవసరమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇటీవల జరిగిన ఓ ఇంటరాక్షన్‌లో నిర్మాత సాహు గరపాటి మాట్లాడుతూ, ఈ సినిమా మొదటి పాటను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తుండగా, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్ తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:జీఎస్టీ ఎగవేత..కాంగ్రెస్ నాయకుడు అరెస్టు!

- Advertisement -