ఆయన్ని కలవడానికి 14 ఏళ్ళు పట్టింది!

88
nani
- Advertisement -

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాగా సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ…పవన్‌పై ప్రశంసలు గుప్పించారు. పవన్‌ ఈ కార్యక్రమానికి రావడం కంటే గొప్ప వేరేది లేదన్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్ళు అయింని అందరు హీరోలని కలిశానని కానీ పవన్‌ని కలవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టిందన్నారు.

ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్‌…అంటే సుందరానికి ఎంటెర్‌టైన్మెంట్‌ మాత్రమే కాదు ఎంజాయ్‌మెంట్ అని తెలిపారు నాని.

- Advertisement -