శ్యామ్ సింగ రాయ్‌…అప్‌డేట్

205
nani
- Advertisement -

నాని, సాయిపల్లవి, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ ఎస్ బోయిన‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ నెల 13 వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి సంక్రాంతికి చిన్న బ్రేక్ ఇవ్వనున్నారట.

ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న టక్ జగదీశ్‌ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న డిఫరెంట్ మూవీ ఇది. సాయి పల్లవి, క్రితి శెట్టి ఈ సినిమాలో నాని సరసన నటిస్తున్నారు.

- Advertisement -