నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన ‘నిన్నుకోరి’ మూవీ జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబడుతుంది. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ మంచి నటనతో ఆకట్టుకున్నారు. కానీ ఈ మూవీ మాస్ ఆడియన్స్ని మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎలాగైనా తన సినిమాని మాస్ ఆడియెన్స్ కు చేరవేసేందుకు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు నాని.
‘నిన్నుకోరి’ సినిమాకి ముందు ప్రచారంపై దృష్టి పెట్టని నాని ఇప్పుడు వరుసపెట్టి పెద్ద న్యూస్ ఛానల్స్ కి లైవ్ ఇంటర్ వ్యూస్ ఇస్తున్నాడు. అంతేకాదు లైవ్ లో మాస్ ఆడియెన్స్ ను తక్కువుగా అంచనా వేసా అని అసలు క్లాస్ మాస్ తేడా అనేది సినిమాకి ఉండదని చెబుతూ నిన్నుకోరి అక్కున చేర్చుకున్న ప్రేక్షకులకి థ్యాంక్ అని మాస్ ఆడియెన్స్ కి పెద్ద సారీ అని తెలిపాడు.
అయితే ఇప్పుడు నాని ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ సోషిల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది నాని ఈజ్ సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది సారీ చెబితే సినిమా చూసేస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైతేనేం నిన్నుకోరి సినిమా కేవలం క్లాస్ వాళ్లకోసమే తీసినట్లుగా తన సారీతో చెప్పకనే చెప్పేసాడు నాని. మరి ఈ క్లాస్ చిత్రాన్ని మాస్ ఆడియెన్స్ ఏ రీతిన ఆదిరిస్తారో చూడాలి. క్లాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తూ వరుస హిట్లు కొడుతున్నాడనే పేరుతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సాగిపోతుంది.