‘దసరా’ గెటప్ తో నాని సర్ప్రైజ్

112
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటింగ్ మూవీ దసరా మార్చ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం కొన్ని నెలల లాంగ్ హెయిర్ మెయిన్ టైన్ చేస్తూ వచ్చాడు నాని. తాజాగా ఈ గెటప్ తో అభిమానులను కలిసి ఓ ఫోటో ఘాట్ ఏర్పాటు చేసుకున్నాడు. వెనుక సిల్క్ స్మిత ఇమేజ్ తో నాని తన ఫ్యాన్స్ కి ఫోటోస్ ఇచ్చాడు. దసరా సినిమాలో నాని సిల్క్ స్మిత వీరాభిమానిగా నటిస్తున్నాడు. అందులో భాగంగానే ఆమె స్టిల్ బ్యాక్ గ్రౌండ్ లో సెట్ చేసుకున్నాడు.

రెండ్రోజుల ముందే నాని ఫ్యాన్స్ మీట్ అంటూ ప్రచారం చేశారు. అభిమానులకి పాస్ లు డిస్ట్రిబ్యూట్ చేశారు. జెనరల్ గా ఫోటో ఘాట్ అంటే స్టైలిష్ లుక్ లో వస్తాడని ఊహించిన ఫ్యాన్స్ కి దసరా గెటప్ తో కనిపించి సర్ ప్రయిజ్ చేశాడు నేచురల్ స్టార్. పంచే కట్టు , రెడ్ కలర్ షర్ట్ , లాంగ్ హెయిర్ తో ఫ్యాన్స్ కి మాస్ అవతారంలో దర్శనమిచ్చాడు. నాని ఉన్నపళంగా ఫ్యాన్స్ కి ఈ లుక్ తో ఫోటోస్ ఇవ్వడానికి కారణం దసరా షూటింగ్ పూర్తవ్వడమే. త్వరలోనే ఈ లుక్ నుండి బయటికి వచ్చేయనున్నాడు నాని. అందుకే మాస్ అవతార్ లో ఫ్యాన్స్ కి ఇలా ఓ జ్ఞాపకం ఇచ్చాడు.

నాని నెక్స్ట్ శౌర్య అనే దర్శకుడితో ఓ ఎమోషనల్ టచ్ ఉన్న క్లాస్ మూవీ చేయనున్నాడు. దసరా లో ఊర మాస్ గా కనిపించి ఆ వెంటనే అల్ట్రా స్టైలిష్ గా కనిపించే పాత్ర ఎంచుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి…

ఫిబ్రవరి3…మైఖేల్‌

ప్చ్.. పదేళ్ల తర్వాత మొదలెట్టాడు

హ్యాండ్ ఇచ్చినా ఛాన్స్ ఇచ్చాడు

- Advertisement -