- Advertisement -
విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ భారీ ప్లాప్ ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈసినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈమూవీ విజయ్ అభిమానులను నిరాశ పరిచింది.
ఇదిలా ఉండగా ఈసినిమా కథ మొదటగా నానికి వినిపించాడట దర్శకుడు క్రాంతి మాధవ్. నానికి కథ నచ్చినా కొద్దిగా మార్పులు చేయమని కోరాడట. ఎటువంటి మార్పులు చేయనని దర్శకుడు చెప్పడంతో నాని ఆసినిమాను వదిలేశాడు. దీంతో అదే కథను విజయ్ దేవరకొండకు వినిపించాడు దర్శకుడు. విజయ్ అంగీకరించడంతో సినిమా చేశాడు. ఈసినిమా నాని వదులుకుని మంచిపని చేశాడని అనుకుంటున్నారు నాని సన్నిహితులు.
- Advertisement -