బాలీవుడ్‌ ‘జెర్సీ’పై హీరో నాని రియాక్షన్‌..

97
- Advertisement -

న్యాచురల్‌ స్టార్‌ నాని న‌టించిన జెర్సీని హిందీలో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ న‌టించిన ఈ చిత్రాన్ని జెర్సీ టైటిల్‌తోనే హిందీలో తెర‌కెక్కించారు. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తాజాగా మూవీ చూసిన హీరో నాని స్పందించాడు.. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ పోషించిన అర్జున్ పాత్ర‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ పాత్ర‌కు షాహిద్‌క‌పూర్ పూర్తి న్యాయం చేశాడ‌ని నాని ట్వీట్ ద్వారా తెలిపాడు.

‘జెర్సీ చూశాను. మా గౌత‌మ్ తిన్న‌నూరి మ‌రోసారి ఈ సినిమాతో హిట్ కొట్టేన‌ట్టే. షాహిద్‌క‌పూర్ అర్జున్ పాత్ర‌ను మ‌న‌స్సు పెట్టి చేశాడు. షాహిద్‌, మృణాళ్ ఠాకూర్‌, పంక‌జ్ క‌పూర్ స‌ర్‌, మై బాయ్ రోనిత్ (చైల్డ్ యాక్ట‌ర్)..ఇది నిజ‌మైన మంచి సినిమా. చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు’ అని ట్వీట్ చేశాడు నాని. నానియే కాకుండా ఎంతోమంది నెటిజన్లు సైతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ సూపర్‌గా ఉందనీ, షాహిద్ కపూర్ నటన అద్భుతమని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. గౌతమ్ డైరెక్షన్‌‌ని మరోసారి ఇరగదీశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మొత్తానికి మన టాలీవుడ్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌గా కబీర్ సింగ్‌తో, తాజాగా జెర్సీతో షాహిద్ కపూర్ వరుస హిట్లు కొట్టడం గమనార్హం. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు స్క్రీనింగ్ అయిన షోల వ‌ర‌కు జెర్సీ సినిమా మంచి స్పంద‌న రాబ‌ట్టుకుంది. దిల్ రాజు, నాగ‌వంశీ, అమ‌న్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ ప‌రంప‌ర మ్యూజిక్‌ అందించారు. ఈ మూవీ బాలీవుడ్‌ ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి మరి.

- Advertisement -