నానితో హ్యాట్రిక్ కు సిద్ద‌మైన ఇంద్ర‌గంటి..

184
Nani

న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. నాని ప్ర‌స్తుతం నాగార్జున‌తో మ‌ల్టిస్టార‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈమూవీకి యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈచిత్రానికి దేవ‌దాస్ అనే టైటిల్ ను ఇటివ‌లే ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా మ‌ళ్లిరావా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ త‌న్నురితో జెర్సీ అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది.

Mohankrishna-Indraganti

మోహ‌న‌కృష ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా స‌మ్మోహనం. సుధీర్ బాబు, అదితి రావు హైద‌రి న‌టించ‌న ఈసినిమాకు భారీ విజ‌యాన్ని సొంతం చేస‌కుంది. బాక్సాఫిస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి నాని కాంబినేష‌న్ లో ఇదివ‌రకే రెండు సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అష్టాచ‌మ్మా, జంటిల్ మెన్ సినిమాలు రెండు మంచి విజ‌యాన్ని అందుకున్నాయి.

అంతేకాకుండా నాని, ఇంద్ర‌గంటి మ‌ధ్య మంచి స్నేహ ఉండ‌టంతో సాన్నిహిత్యం ఉండ‌టంతో మ‌రోసారి క‌లిసి న‌టించ‌డానికి సుముఖంగా ఉన్నాడ‌ట నాని. దింతో వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ను సిద్దం చేసుకునే ప‌నిలో ఉన్నాడ‌ట ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి. ప్ర‌స్తుతం నాని రెండు సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఫిబ్ర‌వ‌రి నుంచి ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇది మూడ‌వ సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది.