మళ్లీ మృణాల్ తోనే ఫిక్స్ అట

43
- Advertisement -

మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. ‘సీతా రామం’తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మృణాల్, వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ కి జోడిగా నటించడంతో పాటు, పలు తమిళ సినిమాలను కూడా లైన్లో పెట్టింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి ఒక్క భాషకే ఫిక్స్ అవ్వడం ఇష్టం లేదని, డిఫరెంట్ రోల్స్ చేయడం ఇష్టమని మృణాల్ చెప్పుకొచ్చింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘నాన్న’ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇందులో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.

అందులో భాగంగా ఈ మూవీని ప్రమోట్ చేయడంలో మృణాల్ స్పీడ్ పెంచింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. అన్నట్టు మృణాల్ నానితో మరో సినిమా చేయడానికి కూడా రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. ప్ర‌స్తుతం హాయ్ నాన్న సినిమా చేస్తున్న నాని, ఆ త‌ర్వాతి సినిమాను వివేక్ ఆత్రేయ‌తో చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబోలో అంటే సుంద‌రానికీ వ‌చ్చింది. ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తుంది. వివేక్-నాని కాంబోలో రానున్న ఈ మూవీ కోసం హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ను ఫిక్స్ చేశార‌ని టాక్.

కాగా ఇప్ప‌టికే నాని, మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న లో క‌లిసి న‌టించారు. మళ్లీ వెంటనే కలిసి మరో సినిమా చేస్తుండటం విశేషం. ‘దాదా’ మూవీకి ‘హాయ్ నాన్న’ రీమేక్ అని అంటున్నారు తమిళ జనాలు. దాదా సినిమాకి, హాయ్ నాన్న సినిమాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

Also Read:కాంగ్రెస్‌కు అదే సెంటిమెంట్ రిపీట్!

- Advertisement -