వరుస హిట్లతో మంచి జోరు మీదున్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం నాని తన మనసు మార్చుకున్నాడు. అనుకున్న సమయం కంటే పది రోజుల ముందుగానే ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
డిసెంబర్ 22 వ తేదీన అఖిల్ సినిమా ‘హలో’ ,23న అల్లు శిరీష్ ఒక్క క్షణం విడుదల కానుంది.ఇద్దరు అగ్రహీరోల కుటుంబాలకు చెందిన విడుదలకు సిద్దంగా ఉండటంతో థియేటర్స్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీనికి తోడు వసూళ్లపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం వుంది. ఈ విషయాన్ని గురించే అల్లు అరవింద్ .. దిల్ రాజు మధ్య చర్చలు జరిగాయట.
చివరికి దిల్ రాజు తన సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ను డిసెంబర్ 15వ తేదీనే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేయనున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ఫస్ట్ లుక్,టీజర్‌తో అలరించిన నాని సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలని త్వరలోనే విడుదల చేయనున్నారు.