ఏప్రిల్‌లో నాని ‘జెర్సీ’..

268
Nani "Jersey"
- Advertisement -

హీరో నానికి ఈ ఏడాది కలిసిరాలేదు. కృష్ణార్జున యుద్ధం పరాజయం కాగా దేవదాస్ ఇద్దరు హీరోలు ఉన్నా యావరేజ్ అనిపించుకోవడానికే నానా తిప్పలు పడింది. ఇక నాని తాజా చిత్రంగా ‘జెర్సీ’ రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

Nani

ఇప్పటికి ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీని కన్ఫామ్‌ చేస్తు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 90ల నేపథ్యంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ కోసం నాని అదే పనిగా క్రికెట్ ప్రాక్టీస్ చేసాడు. ఈ సినిమా తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలుస్తుందని నాని ఎంతో నమ్మకంతో ఉన్నాడు.

- Advertisement -