చిరు అలా పిలిచేసరికి..నాని కామెంట్!

16
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిపై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాని నిర్మాణంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు నాని.

ప్రియదర్శి మాట్లాడుతూ.. నేను అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ప్రమోషన్స్ చేస్తుంటే పక్కన విశ్వంభర షూటింగ్ చేస్తున్నారు. అలా చిరంజీవికి కనిపించి వద్దామని వెళ్తే సినిమా గురించి అడిగారు. కోర్ట్ సినిమా చేస్తున్నా అంటే నాని కదా అయితే ఓకె అని చెప్పారన్నారు.

నాని కూడా చిరంజీవితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. నాగ చైతన్య పెళ్ళికి వెళ్తే నేను లోపలికి వెళ్తుంటే చిరంజీవి బయటకు వస్తున్నారు. నన్ను చూసి ప్రొడ్యూసర్ గారు అని దండం పెట్టారు. ఎవరైనా పెద్ద నిర్మాత వచ్చారేమో అని నేను ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. నేనా సార్ అంటూ ఒక్కసారి తడబడ్డాను ఆ తర్వాత హగ్ ఇవ్వడం మర్చిపోలేదన్నారు.

Also Read:సూర్యాపేటలో నకిలీ డీఎస్పీ …అరెస్ట్

- Advertisement -