Nani:యుఎస్‌లో ‘హిట్ 3’జోరు!

13
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం హిట్ 3.ఈ సినిమా మే 1న రిలీజ్ కానుండగా నాని మరియు శ్రీనిధి శెట్టి కొన్ని రోజులుగా దేశమంతటా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ డ్రామాకు సైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు.

నాని సినిమా వస్తుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంటే యూఎస్ మార్కెట్ లో తనకి ఆ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సహా ప్రీమియర్స్ ఇంకా ప్రీసేల్స్ లో సత్తా చాటుతాయి. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ లోనే ఈ చిత్రం కేవలం ప్రీసేల్స్ తో హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మార్క్ గా కూడా నిలిచినట్టుగా ఇపుడు తెలుస్తుంది.

Also Read:అజార్ పేరును తొలగించవద్దు:హైకోర్టు

- Advertisement -