నేచురల్ స్టార్ నాని హీరోగా వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఆగష్టు 30న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు.
గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ప్రియాంక, లక్ష్మీ , శరణ్య, అనీష్ కురువిళ్ళా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, సత్య తదిదరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అయిదుగురు అమ్మాయిలు దొంగలుగా ఉంటారని వారికి నాయకుడిగా నాని ఉంటారట. ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన గ్యాంగ్ లీడర్ టైటిల్‌తో వస్తున్న నాని ఎలాంటి వసూళ్లను రాబడుతారో వేచిచూడాలి.