నాని ‘దసరా’ వచ్చేది అప్పుడే..!

130
dasara
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ”దసరా” చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై ‘దసరా’ను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. అయితే టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాను ‘దసరా’కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోకపోవడం వలన ఈ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. క్రితం ఏడాది క్రిస్మస్ మనదే అంటూ ‘శ్యామ్ సింగ రాయ్’తో నాని హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇటివలే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ ప్రేక్షకులుని ఆకట్టుకుంది. నాని బీడీ వెలిగించి సింగరేణిలో తన గ్యాంగ్‌తో కలిసి వస్తున్న అగ్రెసివ్ యాటిట్యూడ్‌ కనిపించడం సినిమాతో పాటు నాని పాత్రపై కూడా అంచనాలు పెంచింది. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

- Advertisement -