వరుస హిట్లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు నేచురల్ స్టార్ నాని. అటు రీల్ లైఫ్‌లోనూ ఇటు రియల్ లైఫ్‌లోనూ టైం వచ్చినప్పుడే రెచ్చిపోతున్నాడు. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను మన తెలుగు హీరోలతో పాటు నాని కూడా బాగానే ఫాలో అవుతున్నాడు.
చాలా మంది హీరోలు హిట్ ట్రాక్‌లో ఉన్నప్పుడే ఓ నాలుగు ఇళ్లు వెనకేసుకంటే ఫ్యూచర్లో పనికొస్తాయని తొందరగా సెటిల్ అయిపోవచ్చని డిసైడ్ అవుతుంటారు.
ఆక్రమంలోనే సీనియర్ హీరోలను ఫాలో అవుతున్నారు యంగ్ హీరోలు. ఇటీవల రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండలు సొంతంగా రెండేసి కోట్లు పెట్టి విల్లాలు కొనగా.. తాజాగా ఆ లిస్ట్‌లోకి నేచురల్ స్టార్ నాని కూడా చేరిపోయాడు. హైదరాబాద్‌లో ఓ రిచ్ ఏరియాలో భారీ ధర పెట్టి ఓ విల్లా కొన్నాడట నాని.
టాలీవుడ్ మినిమమ్ గ్యారంటీ హీరో స్థాయి నుండి పక్క హిట్ హీరోగా మారి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ‘నిన్నుకోరి’ అంటూ మరో హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు.
ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ లేకుండానే టాలెంట్‌ను నమ్ముకుని.. మొదట సహాయ దర్శకుడిగా.. తరువాత చిన్న చిన్నరోల్స్ చేసుకుంటూ టాప్ హీరోలతో పోటీ పడే రేంజ్‌కు ఎదిగాడు నాని. మనోడు కెరియర్ ఎదుగుదలతో పాటు పారితోషికం విషయంలోనూ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నాడు. మొదట్లో నిర్మాతలు ఎంతిస్తే అంత అన్నట్టు ఉన్న నాని రేంజ్ అతి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయలకు చేరింది.
ఇక ఇదే సందర్భంలోనే నాని హైదరాబాద్ శివార్లలో ఓ కొత్త ఇల్లు కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. గచ్చిబౌలికి సమీపంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడట నాని. ఈ విల్లా ఖరీదు దాదాపు 5 కోట్లు అని తెలుస్తోంది. త్వరలోనే తన కుటుంబంతో కలిసి ఈ విల్లాలోకి మారిపోతున్నట్టు సమాచారం.