బోల్డ్ ముచ్చట్లు చెబుతున్న నాని

47
- Advertisement -

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని చేస్తున్న సినిమా హాయ్ నాన్న‌. ఈ సినిమాతో శౌర్యువ్ కొత్త డైరెక్ట‌ర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. డిసెంబ‌ర్ 7న రిలీజ్ కాబోయే ఈ సినిమాకు కౌంట్‌డౌన్‌ను మొద‌లుపెట్టారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. మ‌రో 49 రోజుల్లో హాయ్ నాన్న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందంటూ గుర్తు చేశారు. మొత్తానికి తమ సినిమాను జనంలోకి తీసుకు వెళ్ళడానికి నాని టీమ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి వారం ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాలని నాని కూడా డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఈ వారం నాని లిప్ లాక్స్‌ పై స్పందించాడు.

హాయ్ నాన్న టీజ‌ర్ రీసెంట్‌గా రిలీజైంది. టీజ‌ర్‌లో లిప్ లాక్ సీన్స్ చూసి, ఈ మ‌ధ్య‌ మీ ప్ర‌తి సినిమాలో లిప్ లాక్స్ చేస్తున్న‌ట్లున్నార‌ని నానిని అడిగితే దానికి నాని స్పందించాడు. క‌థ డిమాండ్ చేసిన‌ప్పుడు ఎలాంటి సీన్స్ అయినా చేయాలి. ఇక్క‌డ‌ క‌థ‌కు అవ‌స‌రం కాబ‌ట్టే లిప్ లాక్ సీన్స్ చేశాం. ఇలాంటివి చేసిన‌ప్పుడు ఇంట్లో చాలా గొడ‌వ‌ల‌వుతుంటాయి, కానీ త‌ప్ప‌క చేస్తుంటామ‌ని నాని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వచ్చే వారం హీరోయిన్ తో ఓ బెడ్ రూమ్ సన్నివేశం పై కూడా నాని మాట్లాడతాడట. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సన్నివేశం చాలా బోల్డ్ గా ఉంటుందట.

మొత్తానికి ‘హాయ్ నాన్న’ సినిమా పై ప్రేక్షకులలో ఆసక్తి పెంచడానికి నాని ఇలా బోల్డ్ విషయాలను చెప్పడానికి రెడీ అయ్యాడు. అయితే ‘దాదా’ మూవీకి ‘హాయ్ నాన్న’ సినిమా రీమేక్ అని అంటున్నారు తమిళ జనాలు. దాదా సినిమాకి, నాన్న సినిమాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కాగా ఇందులో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇంతకీ ‘హాయ్ నాన్న’ సినిమా రీమేకా ?, కాదా ? మేకర్స్ కే తెలియాలి.

Also Read:పోటీలో బాలయ్యే నెగ్గాడు

- Advertisement -