అ!..టీజర్‌కు ముహుర్తం ఖరారు

248
Nani Awe Teaser on January 4th
- Advertisement -

వాల్‌పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పిస్తున్న సినిమా ‘అ!’.  నిత్యా మేన‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల నిత్యా, అవ‌స‌రాల‌, ఈషా, రెజీనా,నాని పాత్ర‌ల ఫ‌స్ట్‌లుక్స్ విడుద‌ల చేసి.. సినిమాపై ఆస‌క్తి రేకెత్తించిన చిత్ర యూనిట్‌.. తాజాగా టీజర్‌తో ముందుకువస్తోంది.

జనవరి 4న సాయంత్రం 5 గంటలకు అ! టీజర్‌ని  విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది.

Natural Star Nani Poster in #AWE
ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని..కీలకపాత్రలో నటించనున్నారు. పరోపకారం చేసే చేపగా ‘అ!’లో నేచురల్‌స్టార్‌ నాని’ అనే పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘నా తర్వాతి చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయటంతో ఈదడం నేర్చుకుంటున్నా అని తెలిపారు. ఫిబ్రవరి 2న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

  Natural Star Nani Poster in #AWE

- Advertisement -