నేచురల్ స్టార్ నాని సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఎంసిఏ. ఈ మూవీ మంచి విజయం సాధించింది. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు మరోసారి వీరిద్దరు కలిసి నటించనున్నట్లు తెలుస్తుంది. నాని రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో శ్యాంగ్ సింగ రాయ్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈమూవీలో నాని సరసన సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట.
ఈమూవీలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో…సాయి పల్లవి సెట్ అవుతుందని భావించారట చిత్రయూనిట్. పిరియాడిక్ కంటెంట్ తో ఈమూవీ తెరకెక్కనుందని తెలుస్తుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాల్లో నటిస్తోంది. నానికి ఇది 27వ సినిమా. నాని నటించిన వి చిత్రం విడుదలకి సిద్దంగా ఉంది. దీంతో పాటు నాని టక్ జగదీశ్ అనే మూవీలో నటిస్తున్నాడు.