సుప్రిమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ కు గత కొంత కాలంగా సరైన హిట్ లేక వరుస పరాజయాలతో సతమతమైపోతున్నాడు. కెరీర్ మొదట్లో బాగానే హిట్స్ వచ్చిన ఈమధ్యలో వచ్చిన 5సినిమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు తేజ్. అందుకు అనుగుణంగానే తన బాడీని కూడా చేంజ్ చేసుకున్నారు.
తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈమూవీ హీరోయిన్ గా కళ్యాణ్ ప్రియదర్శిని నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్ధ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఎప్రిల్ 19వ తేదిన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.
ఇక నాని ప్రస్తుతం నటిస్తున్న సినిమా జెర్సీ ఈ మూవీని కూడా ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. గత కొద్ది రోజులుగా ప్లాప్ లతో సతమతమవుతున్న తేజ్ ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ పట్టుకుంది. దింతో చిత్రనిర్మాతలు, దర్శకుడు రిలీజ్ డేట్ పై కొంత సందిగ్దతతో ఉన్నారట. మొత్తానికి ఏప్రిల్ 19 సినిమాను విడుదల చేస్తారో లేక వాయిదా వేసుకుంటారో చూడాలి.