నాగార్జున, నాని నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్‌లో నాగార్జునకు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది. వై జయంతి మూవీస్ సంస్థపై అశ్వినీదత్ నిర్మాతగా సి ధర్మరాజు సమర్పణలో ఈ చిత్రం వస్తుంది. సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త స్టిల్స్‌ని యూనిట్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. అలానే దేవదాస్ నిర్మాత అశ్వనిదత్ నాగార్జునకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు. దేవదాస్ టీమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లను రివీల్ చేసింది. ఈ స్టిల్స్‌లో నాగార్జున చాలా యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చైర్‌లో కూర్చుని నవ్వుతున్న స్టిల్ ఒకటి కాగా, లాంగ్ కోట్, హ్యాట్ పెట్టుకోని ఓ స్తంభానికి ఆనుకుని ఉన్న మరో స్టిల్‌లో నాగార్జున అదిరిపోయాడు. ఇక రేపు ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయనున్నారు.