స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అక్కినేని నాగార్జున మధ్య విభేదాలు లేవని నేచురల్ స్టార్ నాని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని…దిల్-నాగ్ మధ్య విభేదాలు పుకార్లేనని వాటిని నమ్మవద్దని చెప్పుకొచ్చాడు. నాటి నటించిన ఎంసీఏ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా..అక్కినేని అఖిల్ హలో 22న రాబోతుంది. ఎంసీఏని దిల్ రాజు నిర్మించగా హలో మూవీకి నాగ్ నిర్మించారు.
ఈ నేపథ్యంలో విడుదల తేదీ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రచారంపై స్పందించిన నాని తమ సినిమాలకు పోటీ లేదని తెలిపాడు. తన సినిమాతో పాటు అఖిల్ సినిమా హిట్ అవుతుందని నాని చెప్పాడు.
తన ఎంసీఏ ట్రైలర్ బాగుందని అఖిల్ తనకు ఫోన్ చేసి చెప్పాడని తెలిపాడు. తానును హలో సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అఖిల్‌కి కాల్ చేశానని అన్నాడు.ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం దేనిని ఎక్కువగా ఆదరిస్తారో అదే హిట్ అవుతుందని చెప్పాడు. 2017లో తెలుగు సినిమాలు మంచి సక్సెస్ రేటుని అందుకున్నాయని, వచ్చే ఏడాది కూడా ఇలాగే మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని తెలిపాడు.