నంద్యాలలో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్‌..

213
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొన్న నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఓటుహ‌క్కు వినియోగించుకునేందుకు ఓట‌ర్లు ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌తో కలిపి మొత్తం 15మంది అభ్యర్థులు ఎన్నిక‌ల‌ బరిలో నిలిచారు. నంద్యాల్లో గెలుపును తెదేపా, వైకాపాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండటం, ఓటర్లను భారీగా తరలించే ఏర్పాట్లు చేస్తుండటంతో ఈసారి పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.

Nandyala By-Election

నంద్యాల నియోజవర్గంలో 1983 నుంచి గత సాధారణ ఎన్నికల వరకు అత్యధిక పోలింగ్‌ 73.84శాతమే. ఇది 1983లో నమోదైంది. 2014 ఎన్నికల్లో 72.09శాతంగా నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 28న వెల్లడి కానున్నాయి. నియోజకవర్గం మొత్తాన్ని సమస్యాత్మకంగా భావిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 25 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా గుర్తించారు. మొత్తం రాష్ట్ర పోలీసులు 3500 మంది, 10 కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.

Nandyala By-Election

- Advertisement -