విరాటపర్వంలో జాయిన్ అయిన నందిత

292
virataparvam nanditha

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `విరాటప‌ర్వం` . రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది.

తొలుత ఈ సినిమాలో టబు కీ రోల్ పోషిస్తుందని వార్తలు రాగా బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో టబు స్ధానంలో నందితను సంప్రదించింది చిత్రయూనిట్. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన నందిత తాను ఎవరి స్ధానాన్ని రిప్లేస్ చేయడం లేదన్నారు. సినిమా కథ నచ్చడంతో ఒకే చెప్పానని ట్వీట్ చేశారు. దర్శకుడి విజన్‌ బాగుందని సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రియ‌మ‌ణితో పాటు బాలీవుడ్ నటుడు నానా ప‌టేక‌ర్ కూడా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. రానా నక్సలైట్ పాత్ర పోషించనుండగా, సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటించనుందని తెలిపింది.