నందిని సిద్దారెడ్డికి మాతృవియోగం…

1026
nandini siddareddy
- Advertisement -

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌, ప్రముఖ కవి, నందిని సిధారెడ్డి మాతృమూర్తి నర్ర రత్నమ్మ(85) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని వారి స్వగ్రామమైన కొండపాక మండలం బంధారంకు తీసుకురానుండగా రేపు ఉదయం 10 గంటలకు రత్నమ్మ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

రత్నమ్మ(85) మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

- Advertisement -