సమంతకే సపోర్ట్ చేస్తా: నందినిరెడ్డి

47
sam
- Advertisement -

అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందినిరెడ్డి. ఇక ఇండస్ట్రీలో నందిని రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది సమంతే. వీరిద్దరూ కలిసి జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నందిని రెడ్డి.

మేమిద్దరం కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం…అందుకే సమంత నాకు బాగా క్లోజ్ అయిందన్నారు. అక్కా చెల్లెళ్ళలాగా ఉండేవాళ్ళమని కెరీర్ ప్రారంభంలో సమంత లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రాగా తాను మోరల్ సపోర్ట్ ఉన్నానని తెలిపారు.

ఇక సమంత విడాకుల గురించి మాట్లాడుతూ.. సమంత పర్సనల్ లైఫ్ లో దిను జోక్యం చేసుకోను. సమంతనే కాదు ఎవరి పర్సనల్ లైఫ్ లలో మనం జోక్యం చేసుకోకూడదని తెలిపారు. భార్య భర్తల మధ్య సవా లక్ష ఉంటాయి. వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలుస్తుంది కానీ సమంత లైఫ్ లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా సపోర్ట్ తనకే అని తెలిపింది.

- Advertisement -