ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం రోజు రోజుకూ ముదిరి పాకన పడుతోంది. అవార్డుల ఎంపిక కమిటీలో అంతా ఒక కులం వారే ఉన్నారు.ముఖ్యమైన అవార్డులన్నింటీనీ ఒకే కులం వారికి ఇచ్చుకున్నారు.. అని సినిమా వాళ్లు సూటిగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి టీవీల్లో, సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి మరో అడుగు ముందుకేసి కమ్మ లాబీయింగ్ వల్లే ఇలా జరిగిందని విమర్శల వర్షం కురిపించారు.
నంది అవార్డులపై రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి’ అంటూ సెటైర్లు విసిరారు. ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా.. వామ్మో మైండ్ బ్లోయింగ్.. ఎక్ట్సాఆర్డీనరీ.. సూపర్ డూపర్ సెలక్షన్.. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి..’ అని వర్మ వ్యాఖ్యానించారు.
వావ్ నంది అవార్డ్స్ కమిటీ మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్..’ అంటూ విరుచుకుపడ్డ వర్మ.. చివరగా చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీలతో తన కామెంట్ ముగించారు. ఇక నంది అవార్డులపై అసంతృప్తి వినిపిస్తున్న వారిసంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.