ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ

3
- Advertisement -

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, అగ్రహీరో-పొలిటీషియన్ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, రీసెంట్ బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ డైరెక్టర్ క్రియేటివ్ జెమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా అరంగేట్రం చేయబోతున్నారు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం అవుతుంది.

మెమరబుల్ పెర్ఫార్మెన్స్ తో అలరించడానికి మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌లలో ఇంటెన్స్ ట్రైనింగ్ పొందారు. మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. ఈ స్టిల్ అతని నేచురల్ చరిస్మా, కాన్ఫిడెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. పర్ఫెక్ట్ స్టైల్ చేసిన హెయిర్, గడ్డంతో, చెక్ షర్ట్ ధరించి అద్భుతంగా కనిపించారు. అతని స్లీక్ ఎప్పిరియన్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో కాబోయే ప్రామిసింగ్ స్టార్‌ని సూచిస్తుంది.

ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంటర్ గా, లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. పౌరాణిక ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.

ALso Read:అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -