కళ్యాణ్ రామ్….’ఎమ్మెల్యే’ ఫస్ట్ లుక్

168
Nandamuri Kalyanram's First Look in MLA
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ ‘ఎమ్యెల్యే’. “మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్” అనేది ట్యాగ్ లైన్. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణ లో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ల సంయుక్త నిర్మాణం లో ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ నటించనుంది. కళ్యాణ్ రామ్‌తో లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ జోడి కట్టింది.ఇక రేపు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. స్టైలిష్ లుక్‌లో  నందమూరి వారసుడు ఆకట్టుకుంటున్నాడు.

ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్‌లో ఇటీవలె కాజల్ చేరింది. ఇక కళ్యాణ్ రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్‌తో జై లవకుశ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nandamuri Kalyanram's First Look in MLA

- Advertisement -