నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కొత్త దర్శకుడు గుహన్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా హైదరాబాద్ లో చిత్రకరణ జరుపుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందని సమాచారం. చాలా వరకూ ఈసినిమా షూటింగ్ పూర్తైనట్టు సమాచారం. ఈమూవీలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్లుగా నివేదా థామస్, షాలినీ పాండేలు నటిస్తున్నారు.
ఈసినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈసినిమాకు 118 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈనెంబర్ కు ఈసినిమా కథకు చాలా దగ్గర సంబంధం ఉండటంతో ఈటైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరిలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రయూనిట్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ ఈసినిమాతో అయిన విజయం సాధిస్తాడో లేదో చూడాలి మరి.