కల్యాణ్ రామ్ మూవీలో.. హరికృష్ణ .. ఎన్టీఆర్..?

238
NTR-Harikrishna-and-Kalyan-Ram-Come-Together-For-Pawan-Sadineni-Film
- Advertisement -

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ ముఖ్య‌ పాత్ర‌ల‌లో విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం మ‌నం. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎన్నో జ్ఞాప‌కాల‌ని మిగిల్చింది. మెమోర‌బుల్ మూవీగా ఈ చిత్రాన్ని ఇప్ప‌టికి గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ స‌భ్యులు. ఇప్పుడు ఇదే స్టైల్‌లో నంద‌మూరి ఫ్యామిలీ కుటుంబ చిత్రం కూడా తెర‌కెక్క‌నుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Nandamuri Heroes Multi-Starrer?

ప్రస్తుతం కల్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ .. ‘నా నువ్వే’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నవే. ఒక సినిమాలో కాజల్ హీరోయిన్ అయితే .. మరో సినిమాలో తమన్నా హీరోయిన్. ఈ రెండు సినిమాలపై కల్యాణ్ రామ్ బలమైన నమ్మకంతో వున్నాడు. ఇక తన తదుపరి సినిమాను ఆయన పవన్ సాధినేనితో చేయడానికి రెడీ అవుతున్నాడు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో .. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. కథా పరంగా .. నిడివి తక్కువగా గల రెండు ముఖ్యమైన పాత్రలు అవసరం కావడంతో, హరికృష్ణ .. ఎన్టీఆర్ లతో ఆ పాత్రలను చేయించాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. ఆ ఇద్దరూ చేస్తే సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. త్వరలోనే కథానాయికలు ఎవరనేది ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -