నందమూరి చైతన్యకృష్ణ…’బ్రీత్’

48
- Advertisement -

నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ‘బ్రీత్’ విడుదల తేదిని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా పై చాలా క్యురియాసిటీ పెంచింది. చైతన్యకృష్ణ ఇంటెన్స్ అండ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

మార్క్ కె రాబిన్ అందించిన నేపధ్య సంగీతం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. రాకేష్ హోసమణి విజువల్స్ థ్రిల్లింగ్ మూడ్ ని మరింత ఎలివేట్ చేశాయి. బి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ క్రిస్ప్ అండ్ షార్ప్ వుంది. బసవతారక రామ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఆకట్టుకున్నాయి.

Also Read:టీమిండియాకు దెబ్బేసిన ఓవర్ కాన్ఫిడెన్స్..!

- Advertisement -