బాలయ్య కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద భారీ గానే కలెక్షన్లు రాబట్టింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈచిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో బాలకృష్ణ తిరుగులేని మాస్ ఇమేజ్‌ను సాధించుకున్నాడు.
అయితే,.. బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ పెంచరనే వార్తలు జోరు అందుకున్నాయి. సాధారణంగా ప్రతి సినిమాకి నటసింహ తీసుకునే పారితోషికం ఏడు కోట్లు గత కొన్ని సంవత్సరాలుగా తన రెమ్యూనరేషన్ పెంచకుండా ఇదే కంటిన్యూ చేస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య తన రెమ్యూనరేషన్ అమాతం పెంచేశారట. తన రేటు 10కోట్లు అని చెప్పకనే చెప్పేశారట. బాలకృష్ణ తన పారితోషికం ఇంత పెంచడంతో నిర్మాతలు కొంత కంగారు పడుతున్నారట. ఏది ఏమైనప్పటికి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో భారీ విజయం సాధించడంతోనే అమాతం రెటు పెంచినట్లు ఫిల్మ్‌నగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
గౌతమీ పుత్రశాతకర్ణి మూవీకి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. శాతకర్ణి సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు షేర్‌ని రాబట్టిగా…శాటిలైట్, ఆడియో, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో రూ. 20 కోట్లు….. మొత్తం రూ. 70 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. బాలయ్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. అంతేకాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ భారీ మొత్తాన్ని వసూలు చేసింది.
బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
- Advertisement -
- Advertisement -