కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో బాలకృష్ణ యంగ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈసినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎలా మరాడన్నది కధ సారాంశంగా తెలస్తుంది. ఈచిత్రానికి పలు టైటిల్ లను పరిశీలించారు. తాజాగా రూలర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. చిత్ర శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీ సొంతం చేసుకుంది.
ఈవిషయాన్ని జెమిని టీవీ తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. మొత్తానికి బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు ఈ సినిమాకు ‘రూలర్’ టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ సినిమా తాజాగా షెడ్యూల్ ఈనెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈసినిమాను డిసెంబర్ 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.