నమ్రతా శిరోద్కర్.. ఒకప్పుడు మాడల్,ఫేమస్ హీరోయిన్ మాత్రమే. ఇప్పుడామె నమ్రతామహేష్.. మహేష్ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మహేష్‌బాబు మూవీల స్టోరీస్ మొదలు స్క్రీన్‌పై కాస్ట్యూమ్స్ సైతం నమ్రతానే డిసైడ్ చేయాల్సిందేనట. అంతే కాకుండా, ఈ మధ్య వచ్చిన కొత్త సినిమాల పబ్లిసిటీ స్ట్రాటజీలో కూడా నమ్రత ప్లాన్ ఉందని టాక్.
శ్రీమంతుడు తర్వాత ప్రిన్స్ దత్తత తీసుకున్న గ్రామాల్లో పనుల వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటున్నారు. మహేష్ సొంతూరు బుర్రిపాలెంతోపాటు తెలంగాణలోని సిద్దాపూర్ గ్రామాన్ని కూడా అడాప్ట్ తీసుకున్నారు. దత్తత గ్రామాల అభివృద్ధిపై స్వయంగా నమ్రతనే సూపర్ వైజ్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు దత్తత గ్రామాల్లో పర్యటించిన నమ్రతా…గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.తాము దత్తత తీసుకున్న గ్రామాలను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించటంలో బిజీగా ఉన్నారు.
అయితే నాణానికి ఒకవైపు మరోవైపు నమ్రత తీరు చూస్తుంటే రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యంలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి రాజకీయాలతో ప్రత్యక్షంగానే సంబంధం వుంది. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ మనిషి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నారాయన. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరావుకి వివిధ పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన వైఎస్సార్సీపీతో ఇంకాస్త ఎక్కువ సంబంధాలే కలిగి వున్నారు. ఇక, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ. గుంటూరు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గల్లా జయదేవ్, 2014 ఎన్నికల సమయంలో మహేష్‌బాబు ఇమేజ్‌ని బాగానే వాడేసుకున్నారు. ఇక నమ్రతా అదేబాటలో పొలిటికల్ ఎంట్రీకి ప్రిపరేషన్‌లా ఈ గ్రామాల దత్తత ఎపిసోడ్, ఆ గ్రామాల చుట్టూ పొలిటికల్ హడావిడి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికల అన్నీ కుదిరితే త్వరలోనే నమ్రత ఎన్నికల్లో పోటీ చేసినా ఆర్చర్య పడాల్సిన పనిలేదు.