న్యూలుక్‌లో నమ్రతా మహేష్…

277
Namrata's New Look
- Advertisement -

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఈ మాట మహేబాబు భార్య నమ్రతకు కరెక్ట్ గా సరిపోతుంది. మోడల్ గా, హీరోయిన్ గా.. మిస్ ఇండియాగా.. నమ్రత కెరీర్ లో అన్నీ విజయాలే. వీటన్నంటికన్నా మించి ఒక ఇల్లాలిగా నమ్రత ఎంతో వినమ్రంగా జీవితాన్నిగడుపుతున్నారు. ఇటీవలె కుటుంబంతో కలిసి తిరుమల వెంకన్న సన్నిధికి వెళ్లిన నమ్రత.. ఆ వెంకన్నకు మొక్కులో భాగంగా గుండు చేయించుకుంది. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ అలా కనిపించేసరికి చాలా మంది ఆశ్చర్యపోయారు.

తాజాగా హైదరాబాద్ లోనే జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన నమ్రత.. ఇలా కొత్త లుక్ తో స్టైలిష్ గా కనిపించింది. బ్లాక్ అండ్ రెడ్ డిజైనర్ వేర్ లో మహేష్ భార్య సందడి చేసింది. చిన్న స్లీవ్స్ ఉన్న టాప్.. రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేసిన బాటమ్.. నమ్రతకు భలే మ్యాచ్ అయ్యాయి. డ్రెసింగ్ తో పాటు.. ఈమె స్టైలింగ్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది. చిన్న ఫంక్షన్స్ కు కూడా ఫ్యాషన్ అండ్ స్టైల్ లో తన నావెల్టీని చూపించే నమ్రత.. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేసేసింది.

Namrata's New Look

గుండు చేసుకున్న తర్వాత మహేష్‌-కొరటాల కాంబినేషన్‌లో మహేష్‌ 24వ సినిమా పూజా కార్యక్రమాల్లో కనిపించిన నమ్రత…తాజాగా న్యూలుక్‌తో మళ్లీ అదరగొట్టింది. ప్రస్తుతం మురుగదాస్‌తో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీతో మహేష్ బిజీగా ఉన్నాడు.

- Advertisement -